మాస్ మహారాజా మూవీ కి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి ఏంటో తెలుసా..?

మాస్ మహారాజా కు తిరిగి బ్రేక్ ఇచ్చిన సినిమా రాజా ది గ్రేట్. ఈ సినిమా 2017 అక్టోబర్ 18 న విడుదలై మంచిటాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రవితేజ ఆంధ్రుడు పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు హీరో రవితేజ, శ్రీనివాస్ రెడ్డి అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కి పోటీ వచ్చి పోటీలో నిలవలేక పోయిన సినిమాలు ఏంటో చూద్దాం.

రాజా ది గ్రేట్ సినిమా విడుదల కాకముందే అక్టోబర్ 13న నాగార్జున నటించిన రాజుగారి గది-2 సినిమా విడుదలైంది. ఈ సినిమాలో సమంత మెయిన్ పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.

ఇక సునీల్ కుమార్ డైరెక్షన్లో గర్ల్స్ మూవీ కూడా అప్పుడే విడుదలైంది. ఇక ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్గా చేతన నటించినా కూడా నిరాశ పరిచింది.

ఇక అక్టోబర్ 6వ తేదీన నేను కిడ్నాప్ అయ్యాను అనే మూవీ విడుదల కాగా ఇది ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది. ఇక అక్టోబర్ 27న ఉన్నది ఒకటే జిందగీ సినిమా విడుదల కాగా.. ఈ సినిమా మొదట్లో కలెక్షన్లు బాగా రాబట్టిన ఆ తర్వాత యావరేజ్ గా నిలిచింది.

అనగనగా ఒక దుర్గ అనే సినిమా విడుదల కాగా ఇది కూడా ఫ్లాప్ గా నిలిచింది. ఇక నవంబర్ 3న రాజశేఖర్ హీరో గరుడవేగ సినిమా తెరకెక్కించ గా ఈ మూవీ ఎంతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక సాయికుమార్ కొడుకు ఆది కూడా నెక్స్ట్ నువ్వే అనే సినిమా విడుదల చేయగా ఈ మూవీ ఫ్లాప్ లిస్టులో వెళ్ళిపోయింది.

Share post:

Latest