మరో బిగ్ ప్రాజెక్ట్ పట్టేసిన థమన్..హీరో ఎవరంటే..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎస్.ఎస్.తమన్ కు అదృష్టం పట్టుకుందని చెప్పాలి. ఎందుకంటే వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఒక దాని తర్వాత మరొకటి తన ఖాతాలో వేసుకుంటూనే ఉన్నారు.. ఇప్పటికే అఖండ, గని, సర్కారు వారి పాట, థాంక్యూ , భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ వంటి చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు ను చేజిక్కించుకున్నాడు.. ఆ చిత్రం ఏమిటంటే విజయ్ తొలిసారిగా తెలుగులో నటించబోతున్న # దళపతి 66 అనే సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించడానికి అవకాశం కొట్టేశాడు.

ఇప్పటికే విజిల్ , మాస్టర్ వంటి చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకులలో మంచి గుర్తింపు పొందిన ఈయన, ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ లోనే అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతుండగా మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నట్లు తాజాగా ప్రకటించడం జరిగింది.. ఇక ఈ సినిమాలో కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ పని చేస్తే, ఈయన రేంజ్ మరింత పెరిగిపోయే అవకాశం ఉందని ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest