మహా అద్భుతం.. ఇకపై గిరి పుత్రులకు కోయ భాషలో విద్యాబోధన..!

మహా అద్భుతం.. ఇకపై గిరి పుత్రులకు కోయ భాషలో విద్యాబోధన..!

 

సాధారణంగా విద్యాబోధన అనేది భాషను బట్టి, విద్యార్థులకు ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తూ ఉంటారు.. ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతి, ఒడిస్సీ.. ఇలా రకరకాల రాష్ట్రాలలో ఉండే భాషను బట్టి విద్యాబోధన చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు వినూత్నంగా ఒక తెగ కోసం ఏకంగా వారి భాషలోనే విద్యార్థులకు విద్యా బోధన చేయాడాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందిస్తూ ట్వీట్ చేశారు.

Image

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరి పుత్రులకు కోయ భాషలో ప్రాథమిక విద్యా బోధన చేయాలి అని ఏపీ విద్యాశాఖ ప్రయత్నాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ఇకపోతే ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో తుళు భాష మాట్లాడుతున్నప్పటికీ ,లిపి లేని కారణంగా ఈ భాషను గుర్తించలేదు.. కానీ గత కొన్ని సంవత్సరాల క్రితం లిపి ని కూడా అందించి విద్యార్థులకు ప్రాథమిక విద్యా బోధన చేస్తున్న విషయం తెలిసిందే.

https://twitter.com/VPSecretariat/status/1439444911602823169?s=20

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా వినూత్నమైన ఆలోచన చేసి లిపిలేని కోయ భాషకు.. తెలుగులోనే అక్షర రూపం ఇచ్చి, గిరి పుత్రులకు మాతృభాషలోనే ప్రాథమిక విద్యను అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.. ఇక ఈ విషయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసిస్తూ.. ఈ విధంగా ట్వీట్ చేశాడు.. ఏపీ ప్రభుత్వంలో 8 జిల్లాలలో 920 పాఠశాలల్లో గిరిజన విద్యార్థుల కోసం కోయ భాషను ప్రాథమిక విద్యలో అందించడానికి చేపట్టిన ప్రయత్నం విని ఎంతో సంతోషించాము అని ఆయన ట్వీట్ చేశాడు.. అంతేకాదు కోయ భాష లో ప్రచురించబడిన తొలకరి చినుకూకు ఒకటవ తరగతికి చెందిన పుస్తక ముఖ చిత్రాన్ని కూడా ఆయన జత చేయడం జరిగింది.https://twitter.com/VPSecretariat/status/1439444838005428225?s=20