మా ఎలక్షన్స్: చిరంజీవి ఓటు తనకేనంటున్న విష్ణు..!

మా మూవీ అసోసియేషన్ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ఓటు తనకి అంటూ మంచు విష్ణు చెప్పుకొస్తున్నాడు. ఇక ఈ విషయంపై బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మంచు విష్ణు. ఇటీవలే తన ప్యానల్ సభ్యులను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను తెలియజేశాడు. మా అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజు కంటే తానే బాగా పని చేయగలనని విష్ణు చెప్పుకొచ్చారు. అందుకే బరిలోకి దిగానని, ఇంతవరకు చిరంజీవిని కలవలేదని, మాని ఫెస్టో ప్రకటించిన తరువాత వెళ్లి కలుస్తానని,ఆ మాని ఫెస్టో విన్న తర్వాత.. చిరంజీవి కచ్చితంగా అతనికే ఓటు వేస్తారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు విష్ణు.

ఎన్నికలలో గెలిచిన తర్వాత మా భవనాన్ని తన సొంత ఖర్చుతో నిర్మిస్తాను అన్నట్లుగా తెలియచేశాడు. నిర్మాతగా నేను చాలా సినిమాలలో దెబ్బతిన్నప్పటికీ అప్పు తెచ్చి అయినా సరే నిర్మిస్తానని స్పష్టం చేశారు. తన తండ్రి మోహన్ బాబు ఇప్పటివరకు 800 మంది ఆర్టిస్టులకు ఫోన్ చేయగా వారంతా సానుకూలంగానే స్పందించారు అన్నట్లుగా తెలియజేశారు మంచు విష్ణు. మా భవనం ఒకటే కాకుండా ఇతర కారణాలు కూడా సమస్యలున్నాయని, తాను అధ్యక్ష పదవికి ఎన్నిక అయితే ఆ సమస్యలన్నీ తీరుస్తాడు అని చెప్పుకొచ్చాడు.

Share post:

Latest