లవ్ స్టోరీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు అంటే..?

హీరో నాగచైతన్య సాయి పల్లవి కలిసి నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రానికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 640 పైగా థియేటర్లలో విడుదలై ఫస్ట్ రోజే థియేటర్ల కౌంట్ ని 700 వరకు పెంచేసింది. వరల్డ్ వైడ్ గా దాదాపు 1000 థియేటర్లకు పైగా విడుదలైంది.

ఇక ఈ సినిమా విడుదలకు ఒక వారం నుండి అడ్వాన్స్ బుకింగ్ లు మొదలయ్యాయి. మొదట్లో సినిమా టికెట్లు స్లోగా బుకింగ్ అవ్వగా రానురాను టికెట్ల..60-65% పెరిగాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయాయి అని సమాచారం.టికెట్ల ధర పెంచకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో కలెక్షన్లు ఎలా వస్తాయి అనే విషయం ఆసక్తికరంగా మారింది.

అయితే బుకింగ్ చేసుకున్న మేరకు ఈ సినిమా 5 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లను రాబట్టినట్లు సమాచారం. ఇక ఇదే విధంగా ఈ రోజు నైట్ వరకు ఈ సినిమా టాక్ కొనసాగితే దాదాపుగా 7 కోట్లు కలెక్షన్లు సొంతం చేసుకొనే అవకాశం ఉన్నట్లుగా ఎక్కువగా టాక్ వినిపిస్తోంది.ఎట్టకేలకు ఒక మంచి హిట్ అందుకున్నాడని నాగచైతన్య చెప్పుకోవచ్చు.

Share post:

Latest