లవ్ స్టోరీ సినిమాను రిజెక్ట్ చేసిన యంగ్ హీరో..!

ఇటీవల నాగచైతన్య , సాయి పల్లవి కలిసి నటించిన సినిమా లవ్ స్టోరీ.. మొదటి షో తోనే మంచి హిట్ టాక్ ను అందుకుంటోంది.. అంతేకాదు నాగచైతన్య సినీ కెరీర్లో అతి పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమా కూడా ఇదేనని చెప్పవచ్చు.. సెకండ్ వేవ్ తర్వాత మొదటిసారి టాలీవుడ్ లో ఈ సినిమా రావడంతో భారీ సక్సెస్ ను అందుకుంది.. తొలివారం పూర్తయ్యేసరికి మంచి కలెక్షన్లను వసూలు చేసిన ఈ సినిమా.. నాగచైతన్య సినీ కెరీర్లో హయ్యస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమా కూడా ఇదే.. నిజానికి ఈ సినిమా కథ నాగచైతన్య దగ్గరికి రావడానికి ముందు చాలా చోట్ల తిరిగింది.

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల కొత్త వాళ్ళతో ఈ సినిమా చేయాలని అనుకున్నాడు.. అందుకోసమే కొత్తవాళ్లను తీసుకొని మొదలు పెట్టాడు.. కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత ఆయనకు సంతృప్తిగా అనిపించలేదు.. దీంతో తెలిసిన వాళ్లతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు.. కొంతమందికి తన సినిమా కథను వినిపిస్తూ .. చివరికి మెగాహీరో వైష్ణవ్ తేజ్ దగ్గరకు కూడా లవ్ స్టోరీ కథ వెళ్లిందట.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా అంటే ఎవరు మాత్రం వదులుకుంటారు.. ఇక అదే విధంగా వైష్ణవ్ తేజ్ కూడా సినిమా చేయడానికి ఆసక్తి చూపారు..

కానీ ఉప్పెన సినిమా కులాంతర ప్రేమ కథ కాన్సెప్ట్ గా తెరకెక్కించడం జరిగింది ..కాబట్టి రెండోసారి కూడా ఇదే కాన్సెప్ట్ అయితే ప్రేక్షకులు ఆదరించరని వైష్ణవ్ రిజెక్ట్ చేశాడు.. ఆ తర్వాత ఈ సినిమా కథ నాగచైతన్య దగ్గరికి వెళ్లి మంచి విజయాన్ని అందుకుంది.