కియా సంస్థలో .. మృగాలుగా మారిన ఉద్యోగులు..ఏకంగా రాడ్లతోనే కొట్టుకుంటున్నారు..!

అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో ఏర్పాటు చేసిన కియా పరిశ్రమలో ఉద్యోగుల మధ్య ఘర్షణ ఏర్పడి, అది సంచలనంగా మారింది.. ఈరోజు ఉదయం ఇనుపరాడ్లతో జూనియర్ , సీనియర్ ఉద్యోగుల మధ్య ఘర్షణ ఏర్పడి , ఒకరికి ఒకరు దాడి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త కాస్త పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ప్రధాన ప్లాంట్ లో హుండాయ్ , ట్రాన్సిస్ కంపెనీ ఉద్యోగుల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి.. అని అక్కడ సహా ఉద్యోగులు చెబుతున్నారు..

ఉద్యోగులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నా..కియా పరిశ్రమ ప్రతినిధులు మాత్రం పట్టించుకోకపోవడంపై మిగతా ఉద్యోగులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు.. ఉద్యోగుల మధ్య ఇలాంటి ఘర్షణలు ఎలాంటి వివాదాలకు దారి తీస్తాయో అన్న భయంతో, మిగతా ఉద్యోగులు భయపడుతున్నట్లు సమాచారం.. ఇటీవల గొడవకు దిగిన ఉద్యోగులను సంస్థ తొలగించినట్లు తెలుస్తోంది. ఇకపోతే కియా కంపెనీని తమిళనాడు కు తరలిస్తున్నారు అనే విషయం ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది.

Share post:

Latest