రష్మి కి పెళ్లి అయ్యిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ సతీష్?

సుధీర్,రష్మి ఈ జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలి అనే వారు ఎంతో మంది ఉన్నారు. అంతేకాకుండా వీరిద్దరిపై బుల్లితెరపై ఇప్పటికే ఎన్నో రకాల ఈవెంట్లను చేశారు. బుల్లితెరపై ఈ జంటను ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు. వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించినా రష్మీ, సుధీర్ మాత్రం ఈ విషయంపై పూర్తి క్లారిటీ నీ ఇవ్వడం లేదు. ఇది ఇలా ఉంటే రష్మికి పెళ్లి అయిపోయింది అంటూ జబర్దస్త్ కమెడియన్ సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అప్పట్లో చమ్మక్ చంద్ర, ముక్కు అవినాష్ టీమ్ లలో కమెడీయన్ గా చేసిన సతీష్ తాజాగా సుధీర్ రష్మి మధ్య ఉన్న బంధం గురించి షాకింగ్ కామెంట్ చేశారు. వీరికి పనేం ఉండదు. సుధీర్,రష్మీ ల మధ్య లవ్ ట్రాక్ లో పెట్టి ఆర్ఆర్ లు వేసి అది జనం లోకి వెళ్ళిపోయి ఇళ్ల మధ్య ఏదో బలంగా ఉందని నమ్మేట్టు చేస్తారు. మొన్న నేను వైజాగ్ గురించి ఒకడు భయ్యా వారిద్దరు కొలవాలి అని అంటాడు. వాడి పిచ్చి కానీ షూటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు.అలాగే అసలు రష్మి కి పెళ్లి అయింది అన్న విషయం వీడికి తెలుసా? అలాగే సుధీర్ కి పెళ్లి అయిందో లేదో వీడికి తెలుసా? వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించుకోవడం కోసం ఏదేదో చేస్తూ జనాలను పిచ్చోళ్లను చేస్తుంటారు. తీసుకోవడం లేదు. సుధీర్ రష్మీ ముసలోళ్ళు అయిపోతున్నారు. ఇంకా వాళ్ళు కలుస్తారా అని ఎపిసోడ్ లు పెడుతున్నారు. సుధీర్ రష్మి చచ్చిపోయే వరకు కూడా కలవరు.. అందుకు నేను గ్యారెంటీ ఇస్తున్నాను సతీష్ అన్నారు.

Share post:

Latest