ఇలియానాకు స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. ఎవరి సినిమాలో అంటే..!

రామ్, వైవీఎస్ చౌదరి కాంబినేషన్లో వచ్చిన దేవదాస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. తొలి సినిమాతోనే హిట్ ను తన ఖాతాలో వేసుకుని ఆ తరువాత మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. పోకిరి ఇండస్ట్రీ హిట్ కావడంతో ఇలియానా రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఇలియానా తెలుగులో దాదాపు అందరు అగ్రహీరోల సినిమాల్లో నటించింది. టాప్ పొజిషన్ కు చేరుకుంది.

ఆ తర్వాత ఇలియానా మెల్లిగా బాలీవుడ్ కు వెళ్ళింది. అక్కడ అవకాశాలు రావడంతో తెలుగులో సినిమాలు చేయడం ఆపేసింది. అక్కడ కూడా ఫేడవుట్ అయిన తర్వాత మళ్ళీ తెలుగులో ఛాన్సుల కోసం ప్రయత్నించింది. రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఇలియానా చివరిసారిగా నటించింది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అప్పటినుంచి ఖాళీ గానే ఉంటోంది.

తాజాగా ఇలియానాకు నాగార్జున సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చిందని సమాచారం. ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఘోస్ట్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అని సమాచారం. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ మేకర్స్ కాజల్ స్థానంలో ఇలియానా ను హీరోయిన్ గా ఎంపిక చేశారని సమాచారం. ఇలియానా ఈ సినిమాతో ఆయన మళ్లీ తెలుగులో బిజీ అవుతుందేమో చూడాల్సి ఉంది.

Share post:

Latest