హైదరాబాద్ నా ఇల్లు.. ముంబై ఎందుకెళ్తా.. రూమర్లపై సమంత ట్వీట్..!

గత కొన్ని రోజుల నుంచి సమంత – నాగ చైతన్య వైవాహిక బంధం పై వస్తున్న రూమర్లకు ఎట్టకేలకు సమంత నోరు విప్పింది. ఇప్పటికే ఆమె మీడియా ముందుకు వచ్చి తమ వైవాహిక జీవితం పై తప్పుడు ప్రచారం చేస్తే కోర్టుకు వెళ్తానని హెచ్చరించిన విషయం తెలిసిందే.. కానీ మీడియా వర్గాలు మాత్రం ఎవరికి నచ్చినట్టు వారు వార్తలను రాసుకుంటూ వెళ్తున్నారు..

నాగచైతన్య – సమంత , కొద్దిరోజుల్లోనే వెడిపోతున్నారని , విడాకులు కూడా తీసుకోబుతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. మరికొంతమంది నుంచి అయితే ఆమె విడాకులు తీసుకోవడానికి భరణం కింద ఏకంగా 300 కోట్ల రూపాయలను అడుగుతోంది అంటూ కూడా రకరకాల వార్తలు వినిపించాయి.. ఇన్ని రకాలుగా వార్తలు వచ్చినప్పటికీ వీరిద్దరూ ఏ విధంగా కూడా స్పందించలేదు. దీంతో నాగచైతన్య – సమంత అభిమానులు గందరగోళంలో పడ్డారు అనే చెప్పాలి.. అంతేకాదు ఈ నేపథ్యంలో ఆమె రూమర్స్ కి చెక్ పెట్టడానికి షాకింగ్ విషయాలను కూడా వెల్లడించింది.

ఇటీవల తన దుస్తుల బ్రాండ్ సాకి .. ఇక ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా..ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది.. ముందుగానే నాతో ఏ ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నారో రెడీ అవ్వండి అంటూ కూడా తెలిపింది.. ఇంతలోని ఒక అభిమాని ఆమెను.. మీరు నిజంగా ముంబై కి వెళ్తున్నారా..? అని ప్రశ్నించారు..

అందుకు సమంత మాట్లాడుతూ.. నేను ఎక్కడికి వెళ్ళను.. హైదరాబాద్ నా ఇల్లు అని క్లారిటీ ఇచ్చింది.. మేము విడిపోతున్నాం అనే పుకారు ఎక్కడ మొదలైందో తెలియదు.. కానీ నిజంగా మాపై ఇలాంటి రూమర్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.. అంటూ ఎమోషనల్ అయింది సమంత.. ఇప్పుడు వస్తున్న వార్తలపై ఎలాంటి వాస్తవం లేదని, హైదరాబాద్ నాఇల్లు, హైదరాబాద్ నాకు అన్నీ ఇస్తోంది , నేను ఇక్కడే ఉంటాను.. ముంబై కి వెళ్ళను అంటూ చెప్పింది.. దీంతో మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అని తెలుస్తోంది.

Share post:

Popular