జెనీలియాపై వల్గర్ ఆంటీ అంటూ దారుణంగా ట్రోలింగ్స్?

సాధారణంగా సెలబ్రిటీలు కొన్నికొన్ని సందర్భాల్లో ట్రోలింగ్స్ కీ గురి అవుతూ ఉంటారు. ఇలాంటి ట్రోల్స్ ఎక్కువగా బాలీవుడ్లో జరుగుతూ ఉంటాయి. తాజాగా నటుడు రితేష్ దేశ్ ముఖ్,నటి జెనీలియా హోలీ సందర్భంగా వీరి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్లు వల్గర్ ఆంటీ అంటూ దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. నటుడు అర్బాజ్ ఖాన్ పోస్ట్ చేస్తున్న డిజిటల్ షో పించ్. ఈ షో సీజన్ 2 కీ రితీష్, జెనీలియా జంట కూడా వచ్చారు.

ఈ వీడియోలో రితేష్ నటి ప్రీతి జింటాని చేతిపై ముద్దు పెట్టుకోగా జెనీలియా జలసీ తో చూస్తూ ఉంటుంది. అనంతరం ఇంటికి వెళ్ళిన తర్వాత జెనీలియా కోపంతో భర్తను కొడుతున్నట్లు, ఆయన వద్దు అని వేడుకున్నట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయ్యింది . ఈ వీడియోని చూసిన ఒక నెటిజన్ సిగ్గు లేదా వల్గర్ ఆంటీ.. ఎప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తుంటావ్.

ఇది నీ ముఖానికి సెట్ అవ్వదు అని కామెంట్ పెట్టాడు. ఈ విషయంపై స్పందించిన నటి జెనీలియా అతని ఇంట్లో పరిస్థితులు బాలేనట్లు ఉన్నాయి అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. బాయ్ సాబ్ మీ ఇంట్లో బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను అంటూ ఘాటుగా స్పందించింది.

Share post:

Popular