గర్భం దాల్చిన కాజల్.. అసలు మేటర్ ఇదే అంటున్న కాజల్..!

సినీ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ విషయాలు పుకార్లను తెలిసినప్పటికీ ప్రతి ఒక్కరు ఎంటర్ టైన్ మెంట్ కోసమే ఇలాంటి వార్తలను మరింత స్ప్రెడ్ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే కాజల్ అగర్వాల్ సినిమాలకు దూరం కావడంతో గర్భం దాల్చింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.. సామాన్య సినీ ప్రేక్షకులే కాదు సినీ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కాజల్ గర్భవతి అయింది అంటూ వార్తలు రావడం ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.

ఇకపోతే గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకున్న కాజల్, ఆ తర్వాత తన భర్త అంగీకారంతోనే ఆమె వరుస సినిమాలలో ఆఫర్లకు ఓకే చేసింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాలో నటించిన విషయం తెలిసిందే .ఇక త్వరలోనే ఈ సినిమా కూడా విడుదల కాబోతోంది. నాగార్జున తో మరొక సినిమాలో నటించడానికి సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ.

నాగ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ది ఘోస్ట్’ అనే సినిమాలో కాజల్‌ని హీరోయిన్‌గా తీసుకోగా ఉన్నట్టుండి ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుందని తెలుస్తోంది. ఆమె ఈ సినిమాలో రా ఏజెంట్ గా కనిపించబోతోంది అని, ఇందుకోసం మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది అని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.. కానీ ఉన్నట్టుండి సడన్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆమె గర్భం దాల్చింది అంటూ వార్తలు వస్తున్నాయి ..కానీ ఆమె ఏ కారణం చేత ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందో తెలియలేదు. ఇక కాజల్ స్థానంలో త్రిష లేదా ఇలియానాను తీసుకోనున్నట్లు సమాచారం.