ఈ చింత చెట్టు ఎంత మందిని కాపాడింది తెలుసా..?

పెద్దలు చెప్పిన సామెతలు ఎప్పుడు కచ్చితంగా ఫలిస్తే ఉంటాయి. వృక్షో రక్షిత రక్షితః అని అంటుంటారు మన పూర్వీకులు. ఇప్పుడు ఒక చెట్టు దాదాపుగా ఎంతోమంది ప్రాణాలను కాపాడిందట.ఆ చెట్టు ఎక్కడ అది ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం.

అది 1908 వసంవత్సరం.. సెప్టెంబర్ 26,27 ఆ రెండు రోజులు భారీ వర్షాలు కురవడంతో నగరం మొత్తం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో 28న మూసి ఉగ్రరూపం దాల్చింది. పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారంతా జలప్రళయంలో చిక్కుకుపోయారు. ఎంతోమంది అక్కడే ప్రాణాలు వదిలారు. దూసుకొస్తున్న వరద నుంచి రక్షించుకునేందుకు కొందరు ఉస్మానియా దావకాన వెనుక భాగంలో ఉన్న చింత చెట్టు(ఆఫ్జల్ పార్క్) పైకి ప్రాణాలను నిలుపుకున్నారు.

ఆ చెట్టు దాదాపుగా 150 మంది ని కాపాడింది. ఆ రోజు వరదలలో ఎంతో మందిని కాపాడింది. ఈ ఘటన జరిగి ఇప్పటికీ 113 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం ఈ పార్కులో ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ వరద మృతులకు నివాళులర్పిస్తూ ఉంటారు. ఇక మంగళవారం ఫోరం చైర్మన్ మణికొండ వేదకుమార్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.