ఇంత దారుణమా..మహిళా కానిస్టేబుల్ పై గ్యాంగ్ రేప్..!

మధ్యప్రదేశ్లోని మహిళా కానిస్టేబుల్ మీద జరిగిన సామూహిక అత్యాచార ఘటన అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది.మధ్యప్రదేశ్లోని నిముచ్ జిల్లాల 30 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ పై సామూహిక అత్యాచారం వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు, అతని తల్లితో సహా ఐదు మంది పై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు.

పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ఇంచార్జ్ అనురాధ బీర్ వాల్ శనివారం మాట్లాడుతూ.. ఈ నెలలో మొదటి వారంలో ఈ సంఘటన జరిగిందని మహిళా కానిస్టేబుల్ సెప్టెంబర్ 13వ తేదీన ఫిర్యాదు చేసినట్లుగా తెలుపుకు వచ్చింది. ప్రధాన నిందితుడితో సహా అతని తల్లితో కలిపి ఐదు మంది పై కేసు నమోదు చేశామని తెలియజేశారు.

ఐదు నెలల క్రితం మహిళా కానిస్టేబుల్ ఫేస్ బుక్ లో పవన్ అనే యువకుడుతో స్నేహం చేశారని అప్పటినుంచి ఆ యువకుడు ఆ మహిళతో నిరంతరం పవన్ మాట్లాడుతూ సాగాడని అనురాధ గిర్ వాల్ చెప్పుకొచ్చారు.పవన్ తన సోదరుడి పుట్టినరోజు వేడుకలు ఉన్నాయని ఆ మహిళా కానిస్టేబుల్ ను ఆహ్వానించారు.

పవన్తో సహా ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.అంతేకాకుండా నిందితుడు ఒక వీడియోను కూడా చిత్రీకరించాడని.. ఎవరికైనా చెబితే దానిని బయటపెడతానని అన్నట్లుగా బెదిరించినట్లు తెలియజేసింది.

Share post:

Latest