ఈ కారణంగానే ఆర్.ఆర్.ఆర్ సినిమా వాయిదా పడుతోందా ..?

ఆర్.ఆర్.ఆర్.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మల్టీస్టారర్ మూవీగా రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం ఇది .ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా..? అని ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఒకసారి ఈ సినిమాను రాజమౌళి వాయిదా వేస్తూ వచ్చాడు.ఇక మరొకసారి కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వస్తోంది ఇప్పుడు కూడా ఈ సినిమా మరోసారి వాయిదా పడిందని వార్తలు నెట్టింట్లో చాలా హాట్ టాపిక్ గా మారాయి. ఇకపోతే ఈ సినిమా విడుదల కాకపోవడానికి కారణం అదే అంటున్నారు చిత్ర మూవీ మేకర్స్. ఆ కారణం ఏంటో మనం కూడా ఒకసారి తెలుసుకుందాం..

నిజానికి ఈ చిత్రాన్ని రాజమౌళి వచ్చే ఏడాది ఉగాదికి విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ , మనసు మార్చుకుని తిరిగి ఇదే యేడాది అక్టోబర్ 13వ తేదీన విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. కానీ చూస్తుంటే ఇప్పుడు ఈ తేదీ కూడా వాయిదా పడే లాగా కనిపిస్తోంది.. ఇందుకు గల కారణం ఏమిటి ..? అంటే, ఉత్తర భారతదేశంలో వ్యాపార పరిస్థితులు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే గత రెండు వారాల కిందట అక్షయ్ కుమార్ నటించిన బెల్ చిత్రం విడుదల చేయగా , అది కనీసం పది కోట్ల రూపాయలను కూడా రాబట్టలేకపోయింది.

ఈ కారణంగానే ఈ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లు కూడా విడుదల చేయడానికి భయపడుతూ, సినిమా విడుదల తేదీని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట. ఇక పోతే వచ్చే తేదీలలో స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో, రాజమౌళి ఏ తేదీ ఖరారు చేస్తారు వేచి చూడాల్సిందే.

Share post:

Latest