సైలెంట్ గా పెళ్లి చేసుకున్న విద్యుల్లేఖ రామన్.. పెళ్ళికొడుకు ఎవరంటే?

లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె ఎన్నో సినిమాలలో నటించి తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. ఈమె ఎటో వెళ్లిపోయింది, రాజు గారి గది, సరైనోడు లాంటి తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెలుగు భాష లోనే కాకుండా తమిళంలో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. లేడీ కమెడియన్ గా ఈమె ఎన్నో సినిమాల్లో నటించింది. ఇది ఇలా ఉంటే ఇటీవల ఈమె కొంచం బరువు తగ్గి నాజూగ్గా తయారయ్యి షాక్ ఇచ్చింది.

అంతేకాకుండా ఎవరికీ చెప్పకుండా గుట్టుచప్పుడు కాకుండా ఆమె వివాహం చేసుకుంది. అయితే ఆమె వివాహం చేసుకున్న వరుడు పేరు సంజయ్ వాట్వానీ. ఈమె నార్త్ ఇండియన్ సింధూ కుటుంబానికి చెందిన సంజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. మీరు చెన్నైలోనే ఈ సి ఆర్ రోడ్డులో అతికొద్ది మంది కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈమె తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాల్లోకి అడుగుపెట్టి, తన తండ్రి కంటే ఎక్కువగా బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది.