సీటి మార్ సినిమా ఇప్పటివరకు ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

టాలీవుడ్ లో హీరో గోపీచంద్ ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక మంచి సక్సెస్ను అందుకున్నాడు అని చెప్పవచ్చు. ఇక డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాని తెరకెక్కించాడు.ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటించింది. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ కథతో వచ్చిన సినిమా. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన ఈ సినిమా విడుదల కాగా..సినిమా మొదటి రోజే మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే ఇప్పుడు వీకెండ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

1. నైజాం – రూ.2.31 కోట్లు
2.సీడెడ్ – రూ.1.65 కోట్లు
3.ఉత్తరాంధ్ర – రూ. 1.13 కోట్లు
4.ఈస్ట్ గోదావరి – రూ. 0.88 కోట్లు
5.వెస్ట్ గోదావరి – రూ.0.51 కోట్లు
6.గుంటూరు – రూ.1.02 కోట్లు
7.కృష్ణా – రూ.0.53 కోట్లు
8.నెల్లూరు – రూ. 0.46 కోట్లు

ఏపీ + తెలంగాణ రాష్ట్రాలలో రూ. 8.49 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 0.34 కోట్లు
ఓవర్సీస్ రూ.0.10 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా రూ.8.93 కోట్లు.. సాధించింది.

ఇక ‘సీటీమార్’ చిత్రానికి మొత్తంగా రూ.13.23 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందట.మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.8.93 కోట్ల కలెక్షన్ ను రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే మరో రూ.4.30 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఈ కలెక్షన్లను రాబడుతోంది లేదో వేచి చూడాల్సిందే.