సినిమా టికెట్ పై షాకింగ్ నిర్ణయం తీసుకున్న జగన్..?

ఏపీ ప్రభుత్వ సినీ పరిశ్రమ పై బాగా కక్ష కట్టినట్లు ఉంది. ఇక మరొకసారి పరోక్షంగా స్పష్టం చేసింది.రైల్వే టికెట్లు తరహాలోనే సినిమా టికెట్లను కూడా కొనుగోలు చేసుకోవాలని స్పష్టత ఇచ్చింది.ఇక అందుకు సంబంధించి ఒక జీవోను కూడా విడుదల చేసింది.పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సమయంలో టికెట్ రేట్లను తగ్గిస్తూ వైఎస్ జగన్ ఒక జీవో జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న థియేటర్లులోనూ టికెట్ల రేట్లను తగ్గించింది.దాంతో థియేటర్ ఓనర్లు థియేటర్లో నడపడం చాలా కష్టంగా ఉన్నట్లు తెలియజేశారు.ఇదంతా ఇలా ఉండగా టికెట్ల విషయంపై చర్చించేందుకు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ పిలుపు వచ్చింది.చిరంజీవి కూడా జగన్తో మాట్లాడేందుకు సినీ ఇండస్ట్రీలోని పెద్దలతో తన ఇంట్లో సమావేశం అయ్యారు.కానీ చిరంజీవి మాట్లాడే లోపే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తెలుసుకోవడం టాలీవుడ్ జనాలకు పెద్ద షాక్ తగిలింది అని చెప్పవచ్చు.

ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల జనాలకు ఏమీ నష్టం ఉండదు.కేవలం ఆయా డిస్ట్రిబ్యూటర్ల,ఎగ్జిబిటర్లు లకు ఎవరు చెల్లిస్తారు అనేదే ప్రశ్న.దీని వెనుక అసలు కారణం రెవెన్యూ, టాక్స్ లు సినీ ఇండస్ట్రీ నుంచి రావడం లేదని భావించి జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి.