పూరికు మందు గ్లాస్ తో బర్త్ డే విషెస్ తెలిపిన ఛార్మి?

తెలుగు సినీ ప్రేక్షకులకు దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ చిరంజీవి నుంచి నేటి అగ్రహీరోల వరకు ప్రతి ఒక్కరితో పూరి జగన్నాథ్ సినిమాలు తీశారు. అలా ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన తెలుగు సినీ ఇండస్ట్రీ లోని దర్శకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. నేడు పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు,అలాగే ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇందులో పూరి తో కలిసి సినిమాలు నిర్మిస్తున్న హీరోయిన్ ఛార్మి కూడా బర్త్డే విషెస్ చెప్పింది. ప్రస్తుతం ఆ బర్తడే విషెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చార్మి మందు గ్లాసుతో పూరి జగన్నాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. నాకెంతో ఇష్టమైన వ్యక్తి కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నాపై నమ్మకం ఉంచి నందుకు ధన్యవాదాలు.

మీరు గర్వపడేలా ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడూ నిలపెట్టుకుంటూనే ఉన్నాను అంటూ చేతిలో మందు గ్లాస్ పట్టుకుని ముందు కూర్చో లో కూర్చున్నారు పూరి జగన్నాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. దీంతో ఛార్మి చేసిన బర్త్డే విషెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకప్పుడు సినిమాలలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఛార్మి ప్రస్తుతం నిర్మాతగా మారి పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది.

Share post:

Popular