బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సిటీ మార్..?

టాలీవుడ్ లో కరోనా తర్వాత ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి.కానీ వాటిలో ఏ సినిమా పూర్తిగా ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి.ఇక అందులో కొన్ని సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చిన ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.దాంతో ఆ సినిమాలు ఎక్కువ రోజులు ఆడలేకపోయాడు.

ఇక ఇదే నేపథ్యంలో వినాయక చవితి సందర్భంగా గోపీచంద్ సినిమా సిటీ మార్ పై సినీ పరిశ్రమ చాలా ఆశలు పెట్టుకుంది.అప్పటివరకు ప్రేక్షకులు సినిమా థియేటర్ వద్దకు వెళ్లకుండా ఉన్నవారు..అమాంతం థియేటర్లకు వచ్చి చూసేందుకు ఉత్సాహం చూపుతున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమా ఇప్పటివరకు మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో టాలీవుడ్ లో ఆశలు మళ్లీ చిగురించాయి.

ఇంతకుముందు గోపీచంద్తో కలిసి సంపత్ నంది నిర్మించిన చిత్రం గౌతమ్ నంద.ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాని..అందుకోలేకపోయింది. అందుచేతనే ఈ సారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పక్కా కమర్షియల్ సినిమాలు తీసి మంచి హిట్ ను అందించారు డైరెక్టర్ సంపత్ నంది.ఇక ఈ సినిమాలో తమన్నా గ్లామర్ షో సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది.

ఇక గోపీచంద్ సరైన హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. అయితే ఈ సినిమా ఈ మేరకు వసూళ్లను రాబడుతుంది వేచిచూడాల్సిందే.

Share post:

Latest