బిగ్ బాస్-5 సందడి లేకపోవడానికి కారణాలు ఇవేనా..?

బిగ్ బాస్ అంటేనే సందడికి కొదవే ఉండదు అని ప్రతి ఒక్కరూ చెబుతారు. అలానే ఇప్పటివరకు నాలుగు సీజన్ లు ఎంతో సందడితో విజయవంతంగా పూర్తిచేసుకుంది ఈ బిగ్ బాస్ రియాల్టీ షో.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ వచ్చిన రాబోతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ షో లో సందడి లేదు.. అని అంటున్నారు..ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

పోయిన సంవత్సరం కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ ,ఈ షో ఆగలేదు. ఆలస్యమైనా షో మొదలయ్యి , ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందింది. అయితే ఈసారి కూడా కరోనా ప్రభావం ఎక్కువ కావడంతో, కొంచెం లేటుగా ప్రారంభమవుతోంది. ఈ షో మొదలు కానుండగా ఇక ఎప్పుడూ ఉండే హడావిడి మాత్రం ఈసారి కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ ఆదివారం నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.. బిగ్ బాస్ షో కి క్రేజ్ ను పెంచేది కేవలం పార్టిస్పెంట్స్లే.. ఇక ముఖ్యంగా రూమర్ల తో షో రక్తి కట్టేది.. ఇక సోషల్ మీడియాలో మొత్తం దీని గురించి చర్చ సాగేది.. ఎన్నో ఊహాగానాలు మధ్య గాసిప్పులు కూడా పుట్టుకొచ్చేవి..

కానీ ఈసారి మాత్రం ఉప్పులేని పప్పు లాగే చప్పగా సాగుతుంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్. గత కొద్ది వారాల నుంచి సురేఖ, షణ్ముఖ్ లాంటి పేర్లు ప్రచారం అవుతున్నాయి..కానీ ఇప్పుడు ఆ చర్చ కూడా ఆగిపోయింది. మరో మూడు రోజుల్లో ఈ షో మొదలు పెడుతున్నప్పటికీ ఎవరి నుంచి ఎటువంటి చర్చ కానీ, ఆసక్తి కానీ , ఎలాంటి హడావుడి కానీ లేక పోవడంతో అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.. మొదలయ్యాక పరిస్థితి ఇలా ఉండకపోవచ్చు అని కొంతమంది ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Popular