బై.. బై.. అంటున్న కోహ్లీ.. ఎంట్రీ ఇవ్వనున్న రోహిత్ శర్మ..?

విరాట్ కోహ్లీ.. ధోనీ తర్వాత టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకొని టీమ్ ను ముందుకు నడిపిస్తున్న కెప్టెన్ గా మంచి గుర్తింపు పొందాడు.. ఇకపోతే ధోనీ కూడా ఎవరికీ తెలియకుండా కెప్టెన్సీ పదవికి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కోహ్లీ కూడా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం తర్వాత నెలలో అనగా అక్టోబర్ నెలలో జరిగే టి20 వరల్డ్ కప్ తర్వాత టి20 కెప్టెన్సీ పదవికి విరాట్ కోహ్లీ గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు.

ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా ఒక పోస్ట్ పెట్టాడు.. అంతేకాదు కెప్టెన్సీ పదవికి గుడ్ బై చెప్పడం కోసం చాలా సమయం తీసుకున్నాను అని కూడా తెలిపాడు.. తనకు అత్యంత సన్నిహితులు అయిన రవి బాయ్ , రోహిత్ శర్మతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే టి20 కెప్టెన్సీకి తను గుడ్బై చెప్పాలని నిర్ణయానికి వచ్చాడు అని విరాట్ కోహ్లీ తెలిపాడు.. దీనికి సంబంధించి BCCI ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అలాగే సెక్రటరీ జైషా అలాగే కలెక్టర్లతో కూడా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం..

ముఖ్యంగా ఇండియన్ క్రికెట్ టీమ్ కు తన శాయశక్తుల కృషి చేసి, టి20 వరల్డ్ కప్ సాధిస్తామని కోహ్లీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.. అంతేకాదు ఇప్పటి వరకు కెప్టెన్ గా ఉండడం లో తనకు సహాయం చేసిన అందరికీ కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు.https://twitter.com/ICC/status/1438481927997046790?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1438481927997046790%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Fdishadaily-epaper-dshdlyt%2Fviraatsanchalananirnayankeptensikigudbai-newsid-n315956422%3Fs%3Dauu%3D0x88bfb698cf8df12css%3Dwsp

Share post:

Latest