అత్తారింటికి దారేది సినిమాకు ఎన్ని కోట్లు లాభం వచ్చిందంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సమంత కలిసి నటించిన చిత్రం అత్తారింటికి దారేది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ తీశారు.ఈ సినిమా పైరసీ ద్వారా విడుదలైన కూడా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఆ వివరాలను చూద్దాం.

 

డైరెక్టర్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా సినిమా తర్వాత అతిపెద్ద చిత్రం అత్తారింటికి దారేది రావడం విశేషం.ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఒక పాటను పాడి ప్రేక్షకులను అభిమానులను బాగా అలరించాడు.ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించాడు. అయితే ఈ సినిమాలో సమంత ప్రణీత పోటీపడి నటించారని చెప్పుకోవచ్చు.

ఇక అత్తగా నదియా ఎంతో పవర్ఫుల్ గా నటించిందని చెప్పవచ్చు.ఈ సినిమా విడుదలైన మొదటి రోజే 10 కోట్ల రూపాయల వరకు రాబట్టింది. టాలీవుడ్ లోనే మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.మొదటి వారం ముగిసే సరికి దాదాపు 45 కోట్ల రూపాయలను రాబట్టింది.చిత్రం ముగిసే సమయానికి.. 77 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు సమాచారం.