అనుష్కకు వార్నింగ్ ఇచ్చిన టాలీవుడ్ సీనియర్ హీరో..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనుష్క కు టాలీవుడ్ లో సీనియర్ హీరో ఒకరు గట్టి వార్నింగ్ ఇచ్చాడట.గతంలో కూడా వీరిద్దరి గురించి అనేక వార్తలు బాగా వినిపించాయి.హీరోయిన్ అనుష్క నాగార్జున నటించిన సూపర్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.

 

ఆ తర్వాత ఈమె ఎన్నో సినిమాలలో నటిస్తూ బాగా బిజీగా ఉన్నది.ఈమె నటించిన సినిమాల్లో ముఖ్యంగా అరుంధతి, బాహుబలి బిల్లా వంటి సినిమాలు బాగా క్రేజ్ తెచ్చి పెట్టాయని చెప్పుకోవచ్చు. ఆ తరుణంలోనే అనుష్కకి కొన్ని ఫ్లాపులు కూడా ఎదురయ్యాయి. ఇదిలా ఉండగా గతంలో ఒక సినిమాలో హీరో గోపీచంద్ అనుష్కకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు అన్నట్లుగా తెలియజేసింది అనుష్క.

ఇక వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. అనుష్క ఎలాగైనా స్టార్ హోదా కోసం.. ఎలాంటి పని చేయడానికైనా సిద్ధ పడిందట.తమిళంలో నయనతార నటించిన బిల్లా సినిమాని రీమేక్ లో నటిస్తానని చెప్పి ముందుకు వచ్చింది.తమిళ్ లో నయనతార నటించిన బిల్లా సినిమాలొ ఎక్స్పోజింగ్ చేయడం వల్లే స్టార్ హీరోయిన్ల ఎదిగిపోయింది నయనతార. దీంతో అనుష్క కూడా ఎలాగైనా ఆ సినిమాల్లో నటించి స్టార్ హోదాను సంపాదించుకోవాలని ఉద్దేశంతోనే ఆ సినిమా ఒప్పుకున్నది.

ఇక ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత తనకి ఈ సినిమాలో అవకాశం వచ్చిందని గోపీచంద్ కు తెలియడంతో ఆమెకు ఫోన్ చేసి సినిమాలో నటించవద్దని గట్టి వార్నింగ్ ఇచ్చాడట. కానీ ఆమె ఆ మాటలన్నీ పట్టించుకోకుండా ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకొంది. దాంతో ఇక ఆమెతో గోపీచంద్ అసలు కాంటాక్ట్ లోనే లేడట. ఇక ఈ సినిమా ద్వారా అనేక కెరీర్ మలుపు తిరిగింది అని చెప్పుకోవచ్చు.