అనుకున్నది అంత..వచ్చింది ఇంత.. సీటీమార్ 15 డేస్ కలెక్షన్..!

హీరో గోపీచంద్ నటించిన యాక్షన్ మూవీ సిటిమార్ బాక్సాఫీస్ దగ్గర రెండు వారాలు పూర్తి చేసుకుంది.ఈ సినిమా మూడో వారంలో అడుగుపెట్టే సందర్భంగా ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో ఇప్పటివరకు ఒకసారి చూద్దాం.

సిటీమార్ సినిమా మొదటి వారం..8.67 కోట్ల రూపాయలను కొల్లగొట్టగా రెండో వారం వచ్చేసరికి…1.62 కోట్ల రూపాయలను అందుకుంది.మూడవ వారంలో ఎలాంటి కలెక్షన్ని అందుకుంటుందో అన్న విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది.14 వ రోజున 11 లక్షల రూపాయల్ని రాబట్టింది.15 వ రోజు వచ్చేసరికి 9 లక్షలను రాబట్టింది.లవ్ స్టోరీ సినిమా విడుదల కావడంతో ఈ సినిమా మరింత కలెక్షన్లు తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇక 15 రోజుల కలెక్షన్లు విషయానికి వస్తే..

1). నైజాం-2.66 కోట్లు.
2). సీడెడ్-1.93 కోట్లు.
3). ఉత్తరాంధ్ర-1.43 కోట్లు.
4). ఈస్ట్-1.3 కోట్లు.
5). బెస్ట్-63 లక్షలు.
6). గుంటూరు-1.7 కోట్లు.
7). నెల్లూరు-52 లక్షలు.
8). కృష్ణ-61 లక్షలు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకొని..9.88 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా 17.68 కోట్ల రూపాయలను సంపాదించింది. ఇక తెలుగు రాష్ట్రాలలో 12 కోట్లకు బరిలో దిగగా ఇంకా 1.62 కోట్ల రూపాయలని అందుకో వలసి ఉంది.

Share post:

Latest