ఆందోళనలో చరణ్ ఫ్యాన్స్.. కారణం..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో లో రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు . నిజానికి శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే మామూలు విషయం కాదు.. ఇక భారీ బడ్జెట్ తోనే రూపొందుతాయి అన్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న శంకర్ సినిమాకు అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సినిమా ఏకంగా 250 కోట్ల రూపాయలతో తెరకెక్కబోతోందని సమాచారం. సాంకేతిక నిపుణుల కోసం ఏకంగా వంద కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ కి ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఇకపోతే శంకర్ గత సినిమాల ఫలితాలను చూసి చరణ్ ఫ్యాన్స్ ఇప్పుడు తెగ ఆందోళన పడుతున్నారు. ఇక శంకర్ ఈ సినిమాను పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిస్తున్నారు కాబట్టి చరణ్ పాత్ర గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. అన్ని సక్సెస్ అయ్యి , సినిమా కూడా సక్సెస్ అయితే చిరు అభిమానులకు పండగే.. అలా కాదని ఏమాత్రం తేడా వచ్చినా డిజాస్టర్ గా మిగిలుతుంది అని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Share post:

Latest