అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన అఖండ సినిమా..!

ఇటీవల నందమూరి బాలకృష్ణ కూడా వరుసపెట్టి ప్రాజెక్టులతో తెరమీదకు వస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవల ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం అఖండ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా , బాలయ్య హీరోగా వస్తున్న ఈ చిత్రం పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.. ఎందుకంటే బోయపాటి శీను, బాలయ్య కాంబినేషన్లో ఇప్పటికే సింహ, లెజెండ్ వంటి సినిమాలు వచ్చి ప్రేక్షకులను బాగా అలరించాయి.. అంతేకాదు ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచి పోయాయి. ఇప్పుడు అఖండ సినిమా కూడా వీరిద్దరి కాంబినేషన్లో రావడంతో అభిమానులు తెగ ఆశలు పెట్టుకున్నారు.

కరోనా కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్.. ప్రస్తుతం పూర్తి చేసుకుంది.. త్వరలోనే థియేటర్లలో దర్శనం ఇవ్వడానికి రెడీ అవుతున్నారు చిత్రం యూనిట్.. ఇక ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్ అలాగే అభిమానుల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాపై ఉన్న అంచనాలు నేపథ్యంలోనే ఈ సినిమాకు అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే, కోస్తా ఆంధ్రాలో అన్ని ఏరియాల్లో కూడా మంచి భారీ బిజినెస్ జరుగుతోంది. ఇక కృష్ణ, గుంటూరు తో పాటు ఈస్ట్ గోదావరి లో కూడా భారీ రేటు పలికింది.. ఈస్ట్ గోదావరి థియేట్రికల్ హక్కులు.. అఖండ సినిమా ఏకంగా రూ.5 కోట్లకి పైగా పలికినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.. ఇక ప్రీ రిలీజ్ కి ఇన్ని కోట్లు సంపాదిస్తే , ఇక ఈ సినిమా విడుదలై అఖండ నిజంగానే అఖండ విజయాన్ని అందుతుందో ఏమో వేచి చూడాలి.

Share post:

Latest