సీన్ రివర్స్..సాయి పల్లవి స్పీడ్ కి చైతూ బ్రేకులు..!

శేఖర్ కమ్ముల సినిమాలంటే చాలు.. ఆయన సినిమాల్లో హీరోయిన్ల పాత్రకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నిజం చెప్పాలంటే హీరో పాత్ర కంటే హీరోయిన్ పాత్ర హైలెట్ అవుతూ ఉంటుంది. ఆనంద్, గోదావరి సినిమాల్లో ఇదే జరిగింది. ఆ సినిమాల్లో హీరోలుగా నటించిన రాజా, సుమంత్ కంటే కమలినీ ముఖర్జీ కి మంచి పేరు వచ్చింది. ఇక ఫిదా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమాలో హీరోగా నటించిన వరుణ్ తేజ్ కంటే సాయి పల్లవికి ఎంతో పేరు తెచ్చింది.నిజం చెప్పాలంటే హీరో పాత్రను డామినేట్ చేసింది.సాయి పల్లవి కూడా తన పాత్రకు ఎంతో న్యాయం చేసింది.

నాగచైతన్య,సాయి పల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాలో నాగచైతన్య నటించినా ఉపయోగం ఉండదని.. సినిమా విడుదలైన తర్వాత సాయి పల్లవి నటన, డ్యాన్స్ కు మంచి పేరు వస్తుందని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే టీజర్,ట్రైలర్, సారంగదరియా పాటతో సాయి పల్లవి హైలెట్ అవుతూ వచ్చింది. మరోసారి శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ పైచేయి అని అంతా మాట్లాడుతున్నారు.

కానీ సినిమా విడుదలైన తర్వాత సీన్ రివర్స్ అయింది. సాయి పల్లవి చాలా బాగా నటించినా, డ్యాన్స్ వేసినా మొత్తం క్రెడిట్ ఆమెకే చెందలేదు. నిన్న థియేటర్ల నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులందరూ నాగచైతన్య గురించి ప్రత్యేకంగా మాట్లాడడం కనిపించింది. ఏ నోట విన్నా చైతూ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అంటున్నారు. నాగచైతన్య రేవంత్ పాత్రలో బాగా ఒదిగి పోయాడని ప్రశంసలు లభిస్తున్నాయి. సినిమాలో సాయి పల్లవి ఉన్నప్పటికీ ఆమెతో కలసి మంచి నటన కనబరిచిన నాగచైతన్యపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాయి పల్లవి మంచి డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే. ఆమె పక్కన చైతూ తేలిపోతాడని ప్రచారం జరిగినా చైతన్య డ్యాన్స్ లో కూడా తన సత్తా చాటాడు.