ఆహాలో సిద్ధార్థ్ ఒరేయ్ బామ్మర్ది.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరో గా ఒక వెలుగు వెలిగిన హీరో సిద్ధార్థ్.. ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు ఎదుర్కోవడంతో తన సొంత రాష్ట్రంలో ఉంటూ కోలీవుడ్ కే పరిమితమయ్యాడు. అక్కడ మాత్రం ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నాడు. సిద్ధార్థ్ హీరోగా బిచ్చగాడు డైరెక్టర్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఒరేయ్ బామర్ది. మరో హీరో జి.వి.ప్రకాష్ కుమార్ ఇందులో ఓ కీలకమైన పాత్రలో నటించారు.శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్ బాలాజీ ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 13వ తేదీ విడుదలైంది. సిద్ధార్థ్ ట్రాఫిక్ పోలీస్ అధికారిగా..జీవి ప్రకాష్ బైక్ రేసర్ గా ఈ సినిమాలో నటించారు. ఈ మూవీ తమిళ నాట పరవాలేదనిపించే స్థాయిలో కలెక్షన్లు వసూలు చేయగా.. తెలుగులో మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ యాప్ లో అక్టోబర్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ఆహా కొత్త సినిమాల విడుదల సంఖ్య ని పెంచిన సంగతి తెలిసిందే.

అలాగే వరుసగా మలయాళ తమిళ సినిమాలను డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్ చేస్తోంది.అలా వారానికి ఒకటి రెండు సినిమాలు ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సిద్ధార్థ్, విక్రమ్ నటించిన ఒరేయ్ బామర్ది ఒకటవ తేదీనుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక సిద్ధార్థ్ చాలా ఏళ్ళ తరువాత తెలుగులో ఒక డైరెక్టర్ సినిమాలో నటిస్తున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాసముద్రం సినిమాలో తెలుగు హీరో శర్వానంద్ తో పాటు సిద్ధార్థ్ మరో హీరోగా కనిపించనున్నారు.