యాలకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

మన వంటింట్లో దొరికేటువంటి వంట దినుసులలో యాలకులు కూడా ఒకటి. వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటిని ఎక్కువగా వంటలలో వేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము. ఇక ఇందులోని గింజలు దివ్యౌషధంగా ఉపయోగపడతాయి. ఇవి ఎంతో సువాసనలు కూడా కలిగి ఉంటాయి. అయితే వీటి గురించి కొన్ని ఉపయోగాలు మనం తెలుసుకుందాం.

- Advertisement -

యాలకలు ఏదైనా అరుగుదలకు, కడుపునొప్పి వంటి సమస్యలను దూరం చేస్తాయి. యాలకలు మనిషిని బలంగా ఉండేందుకు ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా ఆస్తమా, కిడ్నీలోని రాళ్ళను కూడా కరిగించేందుకు దోహదపడతాయి. ఇక అంతే కాకుండా వీటిని నోటిలో వేసుకొని నమలడం వల్ల నోటి దుర్వాసనను.. పోగొడుతుంది. అంతే కాకుండా మానసిక ఒత్తిడి నుంచి కూడా తగ్గిస్తుంది.

ఇక టీ చేసేటప్పుడు అందులోకి కొంచెం యాలకులను వేసుకొని తాగడం వల్ల, ఎంతో ఉత్సాహంతో పాటు మనసుకి కలిగే ఒత్తిడి నుంచి త్వరగా కోలుకుంటారు. ఇక ముఖ్యంగా నీటిలో నోరూరినా, ఎండలో ఎక్కువగా తిరిగినా తలనొప్పి, వాంతులు వంటివి రాకుండా వీటిని నములుతూ ఉండాలి. ఇక ఇలాంటివన్నీ రాకుండా ఉండాలంటే.. వారంలో ఒకసారైనా ఈ యాలకులను నోట్లో వేసుకొని నమలడం మంచిది.

ఇక అంతే కాకుండా యాలకల వల్ల ఎన్నో లాభాలను కూడా మనం చూస్తూనే ఉంటాం. ఎక్కువగా పాయసం లోకి వేసుకొని తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల అది తొందరగా అరుగుదల వస్తుందని , మన పెద్దలు అప్పటినుంచి వేసుకుంటూనే వస్తున్నారు వీటిని.

Share post:

Popular