వైరల్ : జికా వైరస్ లక్షణాలు, జాగ్రత్తలు ఇవే..

కొద్దిరోజులుగా ప్రపంచమంతా కరోనా వైరస్ తో అతలాకుతలం అయింది. ఇప్పుడు సరికొత్తగా మరొక ముప్పు ముంచుకొస్తోంది ప్రజలకు. అదేమిటంటే జికా వైరస్ అట. ఇది కేరళలో 60 మందికి పైగా పాకినట్లు తెలుస్తోంది.ఇక పూణే లో 50 సంవత్సరాలు గల ఒక మహిళకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా కేరళలో ఒక గర్భిణీకి సోకినట్లు గుర్తించారు. దీంతో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు ఆయా ప్రభుత్వ రాష్ట్రాలు.

జికా వైరస్ అనేది దోమల వల్ల వ్యాపిస్తుంది. ఇది కేవలం పగటిపూట తిరిగేటువంటి దోమల వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి.

జికా వైరస్ లక్షణాలు ఏమిటంటే జ్వరం, కంటి శుక్లాలు, కండరాలు నొప్పులు, తల విపరీతంగా నొప్పి రావడం వంటివి జరుగుతాయి. ఇవన్నీ 3 నుంచి 14 రోజులలో బయట పడవచ్చని who సంస్థ తెలిపింది.

ఇక ఈ వైరస్ సోకిన వారు చనిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుందని తెలిపారు.

ఈ వైరస్ సోకితే బ్లడ్ శాంపిల్స్ ను ఫ్లూయిడ్ తో పరీక్ష జరిపినప్పుడు మాత్రమే గుర్తించగలం.

గర్భిణీ స్త్రీలు ఈ ఇన్ఫెక్షన్ సోకితే లోపల ఉండే బిడ్డ మెదడు మీద ప్రమాదం చూపిస్తుందట. అంతేకాకుండా మెదడులో ఉండేటువంటి నరాల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని డబ్ల్యుహెచ్ఓ సంస్థ తెలిపింది. అంతేకాకుండా నాడీ వ్యవస్థ సమస్య లు వస్తాయని తెలిపింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ.

అయితే ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని, వీటిలో ఎటువంటి లక్షణాలు కనిపించినా సరే వెంటనే జాగ్రత్త పడాలని తెలిపింది WHO సంస్థ.