థలపతి విజయ్ సినిమా నుంచి న్యూ అప్డేట్…!

దళపతి విజయ్‌ పేరు తెలియని వారు ఉండరు. తమిళంలో ఎంతో క్రెజ్ ఉన్న హీరోలలో విజయ్ కూడా ఒకరు. అలాగే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా విజయ్ సుపరిచితుడే. మాస్టర్ సినిమాతో మన ముందుకు వచ్చి ఒక రేంజ్ లో దుమ్ములేపేసాడు విజయ్. ఆ సినిమా తరువాత విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బీస్ట్. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతుంది . ఈ చిత్రం కోసం విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే “బీస్ట్” సినిమా గురించి మరి కొన్ని రోజుల్లో రెండు సరి కొత్త అప్ డేట్స్ విడుదల కాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

బీస్ట్ సినిమా రిలీజ్ డేట్ మీద ఒక అధికారిక ప్రకటన వెలువడడంతో పాటు ఒక పోస్టర్ తోరిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇవ్వనున్నారట.ఇప్పటికే విడుదలయిన రెండు లుక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.అలాగే ఇంకొక అప్ డేట్ ఏంటంటే ఈ చిత్రం నుంచి అనిరుద్ సంగీతం ఇస్తున్న ఫస్ట్ సింగిల్ ను దీపావళి కానుకగా విడుదల చేయవచ్చని సినీ వర్గాల్లో గుసగసాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాపై సౌత్ ఇండియాలో భారీ అంచనాలు ఉన్నాయి. రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది. !

Share post:

Popular