వకీల్ సాబ్ లాంటి లాయర్ కావాలంటున్న కన్నీరు పెట్టుకున్న గణేష్ మాస్టర్..

టాలీవుడ్ లో గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు పని చేశాడు. స్టార్ హీరోలకు సైతం అదిరిపోయే స్టెప్పులు నేర్పించడంలో ఆయనకు సాటి ఎవరూ రారు అన్న విధంగా చేయిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో ఈయన బుల్లితెరపై కూడా ఢీ ప్రోగ్రాం లో జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈయన పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ.. ఎంతో ఆవేదన వ్యక్తం చేశారట. ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇక ఈయన జడ్జిగా తనదైన శైలిలో జడ్జిమెంట్ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. ఇక ఈయన ఇలా జడ్జి గానే కాకుండా అందులో కంటెస్టెంట్ ల బాధలను కూడా తెలుసుకొని, వారికి ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటాడు ఈ మాస్టారు. ఇక ఈ మధ్య కాలంలోనే ఒక కంటెస్టెంట్ కు తన అప్పు నాలుగు లక్షలు ఉండడంతో వాటిని తనే స్వయంగా ఇస్తానని చెప్పి తెలియజేశాడు గణేష్ మాస్టర్. దాంతో ఈయన అమాంతం పాపులర్ అయ్యాడు.

ఇక అంతే కాకుండా గణేష్ మాస్టర్.. పవన్ కళ్యాణ్ కు ఎంత వీరాభిమానో పలు సార్లు పలు సందర్భాలలో చెప్పుకొచ్చాడు. ఇక అంతే కాకుండా ఎక్కడ చూసినా ఆయన పవన్ కళ్యాణ్ స్టెప్పులనే స్టేజి మీద ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక అంతే కాకుండా ఈయనే పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎక్కువగా స్టెప్పులు వేస్తుంటారు.

ఇక తాజాగా ఢీ ప్రోగ్రామ్ లో వకీల్ సాబ్ సినిమాలో ఉండేటువంటి కోర్టు సీను ఈ ప్రోగ్రాంలో కూడా వేయడం వల్ల, ఆ సీను చూసి పవన్ కళ్యాణ్ అంటే ఇదే అంటూ కన్నీరుమున్నీరు అయ్యారు. ఇక ఇందులో చెప్పేటువంటి డైలాగులో పసి పిల్లలు.. మీకేం.. కనిపిస్తుంది రా.. అని ఏడ్చేశాడు గణేష్ మాస్టర్. ఇక జడ్జీలు ఇద్దరు కూడా ఇలాంటివి సమాజంలో ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. అందుకోసమే వకీల్ సాబ్ లాంటి లాయర్ కావాలని చెప్పుకొచ్చారు.

Share post:

Latest