వ్యభిచారం చేస్తూ పట్టుబడిన హీరోయిన్..

రాజ్ కుంద్రా కేసు బయటపడిన అప్పటి నుంచి ఇలా ఎంతో మంది హీరోయిన్లు, హీరోలు కూడా ఎప్పటికప్పుడు అశ్లీల కేసు విషయంలో బయటకు వస్తున్నారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో మొదలైన ఈ అశ్లీల చిత్రాల వ్యవహారం , రోజురోజుకు తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా శిల్పాశెట్టి.. ఆమె భర్త రాజ్ కుంద్రా లు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు . ఇక అంతే కాదు వీరికి సహాయం చేసిన మరో 11 మంది సినీ ప్రముఖులను కూడా ముంబై పోలీసులు అరెస్టు చేసి, ఆరా తీస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఒక బాలీవుడ్ హీరోయిన్ ను ఈ వ్యభిచారం కేసులో పోలీసులు అరెస్టు చేయడం జరిగింది..

ఇక అసలు విషయానికి వస్తే , బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటించి అలాగే అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్ లో కూడా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నందిత దత్త. ఈమె సినీ ఇండస్ట్రీలో సినిమాలో నటిస్తున్నప్పుడు అక్కడ వచ్చే డబ్బు సరిపోలేదని, డబ్బు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కుతోంది. ఈ క్రమంలోనే ఈమె అడల్ట్ కంటెంట్ చిత్రాలతోపాటు, బి గ్రేడ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈమె సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అమ్మాయిలను, సినీ అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి,వారిని ఈ ఊబిలోకి దింపుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలోనే, అందరి ముందు చేతికి బేడీలు వేసి పోలీసులు తీసుకెళ్లారు.

ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. నందిత దత్త ఈ కేసులో దొరకడంతో ముంబై క్రైమ్ పోలీసులు , రాజ్ కుంద్రాకు ఈమెకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈమె ను అరెస్ట్ చేయడానికి ముందు ఇద్దరు యువతులు.. నందిత దత్త మమ్మల్ని వ్యభిచారం చేయమని వేధిస్తున్నారని పోలీసులను ఆ యువతులు ఆశ్రయించడంతో ఈమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈమె కు సంబంధించిన అన్ని విషయాలను బయటకు తీస్తామని కూడా ముంబై పోలీసులు తెలిపారు.

Share post:

Latest