ఉద్యోగం వదిలేసి సినిమా తీసిన ఆ దర్శకుడు..?

శ్రీ విష్ణు హీరోగా రాజ రాజ చోర ఈ సినిమాకి దర్శకుడు “హసిత్ గోలి”. ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్నటి రాత్రి జరిగినది. ఇక ఈ వేదికపై దర్శకుడు మాట్లాడుతూ.. నేను ఉద్యోగం మానేసి ఈ సినిమాల వైపు వచ్చాను. దానికి మా అమ్మానాన్నలు నా పైన నమ్మకం ఉంచి సినిమాలు తీయడానికి అంగీకరించారు అని చెప్పుకొచ్చాడు.

శ్రీ విష్ణు తో సినిమా చేస్తానని నేను అనుకోలేదు. తన యాక్టింగ్ పరంగా, తన నటన పరంగా బాగా చేస్తాడన్న ఉద్దేశంతోనే శ్రీ విష్ణు తో సినిమా చేయడానికి ముందుకు వచ్చాను అని చెప్పుకొచ్చాడు. ఈ కథ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందనే నమ్మకంతోనే , ఈ సినిమాని నేను నిర్మాతలతో కలిసి నిర్మించామని తెలియజెప్పారు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ ఇచ్చారు అని చెప్పుకొచ్చారు.quit my good job and made this film: Rajaraja Chora director

ఇక నటీనటుల విషయానికి వస్తే , అందరు ఈ చిత్రంలో తన పాత్రకు తగిన విధంగా కష్టపడ్డారని చెప్పుకొచ్చారు. వారు పడిన కష్టమంతా వెండి తెరపై కనిపిస్తుంది అని చెప్పుకొచ్చారు ఆయన. ఈ సినిమాకు వచ్చే ప్రేక్షకులు ఎవరి జాగ్రత్తలో వాళ్లు థియేటర్లకు వచ్చి ఎంటర్టైన్మెంట్ ను చూసి ఆనందిస్తారని నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను అని చెప్పాడు డైరెక్టర్..”హసిత్ గోలీ”.

ఇక హీరో రాం రోహిత్ మాట్లాడుతూ.. ఈ సినిమాను నేను చూసాను చాలా బాగా నచ్చింది..శ్రీవిష్ణు కూడా నాకు చాలా కాలం నుంచి తెలుసు.. తను సీరియస్ గా ఉండే పాత్రలు బాగా ఎక్కువగా చేస్తాడు.. అని చెప్పుకొచ్చాడు. ఇక అంతకంటే ఎక్కువ గా కామెడీ పాత్రలు చేయగల సామర్ధ్యం అతని లోనే ఉందని చెప్పుకొచ్చారు.