టోక్యో ఒలంపిక్స్ లో చరిత్ర సృష్టించిన భారత మహిళా హాకీ జట్టు..

టోక్యోలో 2020 ఒలంపిక్స్ జరుగుతున్న విషయం తెలిసిందే .నిన్న, నేడు భారతదేశంలో ఎంతో మంది ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అథ్లెట్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. నిన్న అనగా 20 21 ఆగస్టు 1 వ తేదీన భారతదేశానికి చెందిన పురుష విభాగంలో భారత జట్టు చరిత్ర సృష్టించగా, నేడు ఆస్ట్రేలియాపై మహిళా జట్టు కూడా గెలిచి, చరిత్ర సృష్టించి సెమీ ఫైనల్ కు చేరుకుంది. ఈరోజు ఉదయం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన మహిళ విభాగంలో 1-0 తేడాతో గెలిచి, భారత జట్టు సగౌరవంగా ఫైనల్ కు చేరుకుంది.

కాంస్య పతకం సాధించాలనే పట్టుదల, కృషితోనే క్వార్టర్ ఫైనల్ కు ఏకంగా మూడు సార్లు ఒలింపిక్స్ లో విజేతలుగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుపై , మన భారత సంతతికి చెందిన అమ్మాయిలు.. పూర్తి ఆధిపత్యాన్ని సాధించారు. ఇక మైదానమంతా నెమ్మదిగా కదులుతూ.. మన అమ్మాయిలు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. భారత్ నుంచి గుర్జీత్‌ కౌర్ అనే అమ్మాయి గోల్‌ చేసి, భారత్‌కు తొలి పాయింట్‌ ను అందించింది. దీంతో భారత జట్టు గౌరవంగా సెమీ ఫైనల్ కు చేరుకుంది.

మొదటిసారిగా 1980వ సంవత్సరంలో మొదటి మహిళా హాకీ ఒలంపిక్ క్రీడలను ప్రవేశపెట్టారు. అప్పుడు మాస్కోలో ఒలంపిక్స్ జరగడం జరిగింది. ఇక దాదాపు 36 సంవత్సరాల తర్వాత తిరిగి 2016లో త మహిళల విభాగంలో ఒలింపిక్ క్రీడలను తిరిగి పునః ప్రారంభించారు. రియో లో జరిగిన ఈ ఒలింపిక్స్ లో మహిళా జట్టు పాల్గొని గ్రూప్ టీమ్ నుంచి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాత మహిళా విభాగంలో భారత సంతతికి చెందిన అమ్మాయిలు సెమీ ఫైనల్ కు చేరి, చరిత్ర తిరగరాసింది. ఇక త్వరలోనే కాంస్య పతకాన్ని తీసుకొస్తారని భారతీయులు ఎదురు చూస్తున్నారు.

Share post:

Latest