త్వరలో ఓటీటీ లో ఉదయ్ కిరణ్ చివరి సినిమా..?

హీరో ఉదయ్ కిరణ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరో గా నిలదొక్కుకుంటున్న సమయంలో.. ఆయనని హీరో గా ఎదగనీయకుండా కొంతమంది సినీ ఇండస్ట్రీలో పెద్దలు తొక్కేసినట్లు సమాచారం. ఇక ఈయన ఎంత మంది అభిమానులను సంపాదించుకున్నారో మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఉదయ్ కిరణ్ చాలా సున్నితమైన మనసు కలిగిన వ్యక్తి అని ఇండస్ట్రీలో కొంత మంది చెబుతుంటారు.

హీరో ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ గా అమ్మాయిల మనస్సులను దోచిన నటుడుగా పేరు సంపాదించుకున్నాడు. అప్పట్లోనే ఎన్నో హ్యాట్రిక్ సినిమాలను సంపాదించిన ఏకైక హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ఉదయ్ కిరణ్. కానీ ఉదయ్ కిరణ్ మరణించి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అవుతున్న, ఆయన తీసినటువంటి ఒక సినిమా ఇప్పటి వరకు విడుదల కాలేదు. అయితే ఆయన నటించిన ఎన్నో సినిమాలు థియేటర్ వద్దకు వెళ్లినా, అందులో ప్రేక్షకులు ఉండకపోవడంతో ఎంతో మంది నిరాశ చెందేవారు అన్నట్లు వినిపించేది. ఉదయ్ కిరణ్ చనిపోయి ఏడేళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఈ చిత్రం విడుదల కాలేదు. ఇన్నాళ్లూ థియేటర్స్‌లో విడుదల చేస్తే చూస్తారో లేదో అనే అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఓటిటి వచ్చిన తర్వాత ఉదయ్ చివరి సినిమా అనే క్రేజ్ కారణంగా అయినా చూస్తారనే నమ్ముతున్నారు నిర్మాతలు.

అందుచేతనే “చిత్రం చెప్పిన కథ” సినిమాను కూడా విడుదల చేయలేదు అన్నట్లు అప్పట్లో ఎక్కువగా వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం ఓటీటీ సంస్థ వల్ల ఈ సినిమాను త్వరలోనే మన ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా ఒక మంచి రేటుకి అమ్ముడుపోయినట్లు నిర్మాతలు తెలియజేశారు. ఇక ఉదయ్ కిరణ్ హీరో అభిమానులు కూడా ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా..? ఎలా ఉంటుందో..? అనే ఆతృతతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఉదయ్ కిరణ్ అతి చిన్నవయసులోనే చనిపోవడం సినీ ఇండస్ట్రీకి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతేకాకుండా పలువురు సెలబ్రిటీలు ఉదయ్ కిరణ్ గురించి ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది.

Share post:

Latest