తెలంగాణాలో డెల్టా వేరియంట్ విజృంభణ..కేసులు ఏంతంటే..?

SARS-CoV-2 ఇటీవల తన పంజాను మరింత వేగవంతం చేస్తోంది. అందరూ ఇప్పటివరకు కరోనా కేసులు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి.. అని అనుకుంటున్న నేపథ్యంలోనే, ఇప్పుడు మరోసారి ఈ కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి . అందుకే ప్రతి ఒక్కరు టీకాలు వేయించుకొని ,అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు కోవిడ్ ఇన్ఫెక్షన్లలో తగ్గుదల ఉన్నప్పటికీ , రోజువారి కేసులు ఘణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, కరీంనగర్ , నల్గొండ, ఖమ్మం రంగారెడ్డి , పెద్దపల్లి , వరంగల్ తో సహా మరో 8 జిల్లాలలో ప్రతి రోజు అధిక సంఖ్యలో ఈ కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

ఇక ఈ నేపథ్యంలోనే పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు ఇటీవల కరీంనగర్ ను సందర్శించి, ఆయన అందరికీ కరోనా పై అవగాహన కల్పించారు. ఎప్పటికప్పుడు కరోనాకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలను ప్రోత్సహించడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని థర్డ్ వేవ్ గా మార్చకుండా.. చూసుకోవడానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అందరికి ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు ఎన్ని కష్టాలు ఉన్నా సరే , మీరు తప్పకుండా ఇంట్లోనే ఉండాలని , కరోనా జాగ్రత్తలు పాటించాలని, వ్యాక్సిన్లు తీసుకోవాలని, పరిశుభ్రత పాటించాలి అని జి శ్రీనివాసరావు తెలపడం జరిగింది..

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు.. తెలంగాణలో ఉన్న మొత్తం జిల్లా యంత్రాంగం అలాగే ఆరోగ్య విభాగములు ఇన్ఫెక్షన్లను పెరగకుండా ఉండేందుకు, జాగ్రత్త వహించాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి అవుతున్న తరుణంలో సమావేశాలు, ఈవెంట్లు వంటివి జరగకుండా ఉండాలని సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారులు ప్రజలను కోరుతున్నారు. తెలంగాణలో ప్రతి రోజు సగటున లక్ష పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, మొత్తంమీద కొంతవరకు సెకండ్ వేవ్ అదుపులో ఉందని, కాకపోతే ఇది థర్డ్ వేవ్ కు దారితీయకుండా ఉండాలి అంటే , ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని డాక్టర్ శ్రీనివాసరావు తెలపడం జరిగింది.