సూపర్ స్టార్ కెరీర్ లో భారీ గ్యాప్.. ఎందుకోచ్చిందో తెలుసా?

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఏ ఎన్ ఆర్, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలు ఉన్నా కూడా డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అన్న బిరుదులు సంపాదించుకున్నాడు. అంతేకాకుండా హీరోలు తీసుకోలేని డేరింగ్ డెసిషన్ తీసుకొని సంచలనం సృష్టించారు. అయితే కృష్ణ ఈ పదేళ్లలో దాదాపు వందకు సినిమాలు చేసారు అంటే అతని ధైర్యం ఎలాంటిదో మనమే అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే క్రిష్ణ కెరిర్ లో ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

ఇదిలా ఉంటే హీరో గా ఉన్న కృష్ణ దర్శకుడిగా మారుతూ సింహాసనం సినిమాలో తెరకెక్కించారు. అయితే అప్పట్లో ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.అంతే కాకుండా విడుదల అయిన మొదటి రోజే కోటి 50 లక్షలు వసూలు సాధించి అప్పట్లో సంచలనం సృష్టించింది. అలాగే ఈ నాడు లాంటి కమర్షియల్ సినిమాలతో కృష్ణ రేంజ్ మరింత పెరిగింది. ఆ తర్వాత సింహాసనం,అగ్నిపర్వతం, వజ్రాయుధం, ఊరికి మొనగాడు, ఇలాంటి సినిమాలు కమర్షియల్ గా సూపర్ హిట్ ను సాధించాయి. అయితే దాదాపుగా 30 ఏళ్ళు నిర్వీరామంగా సినిమాలు చేసిన కృష్ణ కెరీర్ లో మొదటిసారిగా గ్యాప్ వచ్చింది. దీనితో ఆ తర్వాత స్పీడ్ గా సినిమాలను చేయలేకపోయారు.