సుకుమార్ కి ఈ పేరు అంటే చాలా ఇష్టమా..? 

మొట్టమొదటిగా సుకుమార్ ఆర్య సినిమా తో దర్శకునిగా కెరియర్ ని స్టార్ట్ చేశాడు. సుకుమార్ తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ ను తన వశం చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత హండ్రెడ్ పర్సెంట్ లవ్ ,ఆర్య 2 సినిమాలను సుకుమార్ రూపొందించాడు.

ఈ మధ్యకాలంలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తో రంగస్థలం తో పాటు నాన్నకుప్రేమతో , నేనొక్కడినే వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాకు డైరెక్టర్ గా చేస్తున్నాడు. అయితే సుకుమార్ కు లక్ష్మి అనే పేరు చాల ఇష్టమట. ఆయనచేసే సినిమాలలో లక్ష్మీ అనే పేరు ఉండేలా సెట్ చేస్తాడట. ఆయన చేసిన సినిమాలో హీరోయిన్ల పేర్లు దీర్ఘంగా ఆలోచిస్తే తెలుస్తుంది.

హీరో రామ్ నటించిన జగడం సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు సుబ్బలక్ష్మి కాగా, తమన్నా సినిమా 100% లవ్ లో మహాలక్ష్మి అని పెట్టారు. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో రిలీజైన రంగస్థలం మూవీలో రామలక్ష్మి కావటం అందరూ గమనించాల్సిన విషయము. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఇక పుష్ప సినిమాలో హీరోయిన్ కి కూడా లక్ష్మి పేరుతో సంబంధం ఉంటుందని సుకుమార్ ఫాన్స్ అనుకుంటున్నారు.

సుకుమార్ ఇతర సినిమాల్లో కొన్ని పేర్లు క్లాస్ గా పెట్టాడు ఎందుకంటే సినిమాలు క్లాస్ గా తీసాడు కాబట్టి పేర్లు కూడా అలాగే పెట్టాడు. సుకుమార్ క్లాస్ గా పెట్టిన పేర్లు సమీరా, గీత ,కృష్ణమూర్తి అని కొన్ని పాత్రలకు పేరు పెట్టారు.

సుకుమార్ స్పందించి వివరణ ఇస్తే , ఈ లక్ష్మి అనే పేరు ఎక్కువ పెట్టడానికి గల కారణాలు చెప్పవచ్చు. ఇంకో వైపు నుండి పుష్పా సినిమాలో బన్నీ ని కొత్తగా చూపించాలని తాపత్రయ పడుతున్నారు సుకుమార్. ఈ మధ్యకాలంలో మాస్ సినిమాలను రూపొందిస్తున్నాడు. రంగస్థలం సినిమాకు మించి పుష్ప సినిమాకు పెద్ద సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. .

Share post:

Latest