సుకుమార్ చేసిన పనికి షాక్ లో గ్రామస్తులు..

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ గుర్తింపుపొందిన సుకుమార్, ఎప్పటికప్పుడు స్టార్ హీరోల ఇమేజ్ ను మరింత హై రేంజ్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఇటీవల మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను కూడా పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఇప్పటికే పుష్పా సినిమా షూటింగ్ పూర్తిగా చివరి దశకు చేరుకుంది. ఇక త్వరలోనే రెండవ పార్ట్ ను కూడా డైరెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సుకుమార్. ఇకపోతే ఉప్పెన సినిమాకు నిర్మాతగా మారిన సుకుమార్, కథ, స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా పని చేశాడు..

ఇక ఉప్పెన సినిమాతో మంచి లాభాలను ఆర్జించిన సుకుమార్ , తమ గ్రామస్తులకు అలాగే చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా తన సేవలతో అందరికీ షాకిచ్చాడు. అంతేకాదు ఇటీవల కరోనా బారినపడిన ఎంతోమందికి ఆక్సిజన్ కు అవసరమయ్యే అన్ని సరఫరాలను చేసి, ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టాడు. ఇప్పుడు కూడా సరికొత్తగా తన తండ్రి జ్ఞాపకార్థంగా ఏకంగా 20 లక్షల రూపాయలను పెట్టి , తన గ్రామంలో ఉన్న స్కూల్ కోసం ఒక అదనపు భవనాన్ని నిర్మించడం విశేషం. ఈరోజు అనగా సోమవారం స్థానిక ఎమ్మెల్యే తో పాటు పలువురు మంత్రులు ఆ భవనాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు.

ఇక ఈయన చేసిన పనికి షాక్ లో నుంచి తేరుకొని ,ఆ గ్రామస్తులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మౌలిక సదుపాయాలను కూడా తన గ్రామంతో పాటు ఇతర గ్రామాలకు కూడా కల్పించాడు డైరెక్టర్ సుకుమార్. ఇక సినిమాల్లో బిజీగా ఉంటూనే , తన గ్రామానికి కావలసిన అన్ని వసతులను కల్పిస్తూ, మంచి మనసున్న వ్యక్తిగా గుర్తింపు పొందుతున్నాడు.

Share post:

Popular