సుధీర్ పై మండిపడ్డ కృష్ణ ఫ్యాన్స్..కారణం ఇదేనా ..?

సుధీర్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది..ఈయన కేవలం కమెడియన్ మాత్రమే కాదు యాక్టర్ అలాగే మ్యూజిషియన్ కూడా.. తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తన నటనతో అందరినీ అలరిస్తూ ఉంటాడు. ముఖ్యంగా సుధీర్ సినీ ఇండస్ట్రీలో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు.. కాకపోతే ఈయనను ప్రేక్షకులు ఆదరించలేదు కానీ కమెడియన్ గా ప్రేక్షకులు ఈయన ను సింహాసనం లో కూర్చోబెట్టారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈయన జబర్దస్త్ షో లలో కమెడియన్ గా నటిస్తూనే , ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రోగ్రాములలో యాంకర్ గానే వ్యవహరిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

ఇలాంటి వ్యక్తిపై కృష్ణ అభిమానులు ఫైర్ అవుతున్నారు..అందుకు గల కారణం ఏమిటో..? ఇప్పుడు తెలుసుకుందాం.. ఇటీవల సుధీర్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో లోకి కృష్ణ నటించిన అమ్మ దొంగ సినిమాలోని పాట” నీతో సాయంత్రం.. ఎంతో సంతోషం” అనే పాటతో ఎంట్రీ ఇచ్చి కామెడీ చేయాలని అనుకున్నాడు.. ఇక దీంతో ఒక్కసారిగా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ సుధీర్ పై నిప్పులు చెరుగుతున్నారు. సుధీర్ ఇలా చేయడం సబబు కాదంటూ కృష్ణ అభిమానులు సుధీర్ పై కోపాన్ని చూపిస్తున్నారు..

సుధీర్ ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రోగ్రామ్ లలో కూడా ఈ పాటతో వచ్చి పేరడీ చేస్తూ ఉండడంతో వాళ్ళు సహించలేక, ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. సుధీర్ క్షమాపణలు చెప్పాలంటూ కూడా కృష్ణ అభిమానులు కోరుతున్నారు. కృష్ణ అభిమానుల కోసం సుధీర్ క్షమాపణ చెబుతారా..? లేదా..? అనేది వేచి చూడాలి.

Share post:

Latest