తమన్నా కెరీర్ లో ఇన్ని హిట్ సినిమాలు రిజెక్ట్ చేసిందా?

తమన్నా భాటియా ఈ పేరు వినగానే ముందుగా టక్కున గుర్తుకు వచ్చేది తన మిల్కీ అందం. శ్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన తమన్నా తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది.అయితే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తమన్నా తన కెరీర్లో కొన్ని సినిమాలను వదిలేసుకుంది. అలా వదిలేసుకున్న సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

హీరో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఛాన్స్ ను తమన్నా వదిలేసుకుంది. అలాగే మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్ సినిమా లో ఛాన్స్ ను వదిలేసుకుంది. అలాగే తమిళంలో ఏఆర్ మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో కూడా ఛాన్సును వదులుకుంది. నాగచైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచి సినిమాలో కూడా తమన్నా హీరోయిన్ ఛాన్స్ వదులుకుంది.ఆషికి 2 సినిమా ఛాన్స్ వచ్చినప్పటికీ తమన్నా వదిలేసుకుంది. అలాగే రామ్ హీరోగా వచ్చిన శివమ్ సినిమా లో కూడా చాన్సు ను వద్దనుకుంది. అలాగే రాజుగారి గది 3, స్పీడున్నోడు, అలాగే రవితేజ వెంకటేష్ కాంబో లో వచ్చిన సినిమా , రమేష్ వర్మ మాస్ మహారాజా రవితేజ కాంబో లో వచ్చిన సినిమా ఇలా ఎన్నో సినిమాలలో అవకాశాలను వదులుకుంది తమన్నా.