షూటింగ్ లో ప్రమాదం.. నటుడికి గాయాలు

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోలు తమ హీరోయిజం చూపించడం కోసం రియల్ గా, కొంతమంది ఫైట్ సీన్ లలో కొన్ని సన్నివేశాలను చేస్తూ ఉన్నారు. అయితే అలా కొంత మంది మాత్రమే చేస్తుంటారు. ఇక మరికొంతమంది షూటింగ్ జరిగే సమయంలో ఏదైనా మిస్ అయ్యి, గాయాల పాలవుతుంటారు. ఇప్పుడు అలాంటి వారిలో తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడికి ఇటువంటి ప్రమాదమే జరిగిందట.

తమిళనాడు రాష్ట్రం లోని దిండిగల్ జిల్లాలో ఒక ప్రదేశంలో, జరుగుతున్న షూటింగ్ సమయంలో ఒక ఇంటి పై జరుగుతున్న సన్నివేశం లో ఒక నటుడు కాలు జారి కింద పడడంతో, అతని తలకు పెద్ద గాయం అయింది. దీంతో అతనికి 8 కుట్లు పడ్డాయని చిత్రయూనిట్ చెబుతోంది. ఇక ఇందులో విషయమేముంటుంది అంటారా..? ఇక ఇప్పుడే అసలైన విషయం మొదలవుతుంది..

అసలే ఏమిటంటే, అతను ఆస్పత్రికి వెళ్లి చూపించుకొని నేరుగా సూటింగ్ స్పాట్ కిన్ వచ్చేసాడట. తమిళ దర్శకుడు పే.రామస్వామి, హీరో కడలి ప్రేమ్ కార్తీక్.. కు సంబంధించిన , ఒక సినిమా శరవేగంతో షూటింగ్ జరుగుతుండగా, ఈ ఘటన జరిగిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా లో నాలుగు అవార్డులు గెలిచిన నటుడు చేరన్, ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.

ఈ సినిమాకి సంబంధించి ఒక యాక్షన్ సీన్ జరుగుతున్నప్పుడు, ఆయన పై నుంచి కాలు జారి కింద పడడం జరిగింది. దీంతో ఆయన తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఇక అతి దగ్గరలోనే ఉండే హాస్పిటల్ కి తీసుకెళ్ళి చికిత్స చేయించగా 8 కుట్లు పడినట్లు సమాచారం. హాస్పిటల్ నుంచి కోలుకున్న వెంటనే ఆయన షూటింగ్ ఆగిపోతుందని ఆస్పత్రి నుంచి నేరుగా వచ్చి చిత్రీకరణలో పాల్గొన్నారు.