హైదరాబాదులో గాలి నుంచి నీరు.. రోజుకు అన్ని వేల లీటర్లు?

హైదరాబాదులో ఉసాట ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన శాస్త్రవేత్తలు గాలిలో ఉండే తేమ ద్వారా గాలి నుండి తాగునీటిని ఉత్పత్తి చేస్తున్నారు. అయితే గాలిలో ఉండే ప్రేమ ద్వారా ఇది సాధ్యమైందని భారత ప్రమాణాల విభాగం హైదరాబాద్ చీఫ్ సీనియర్ శాస్త్రవేత్త కేవీ రావు చెబుతున్నారు. గాలిలో ఉన్న తేమ నుంచి నీటి ఉత్పత్తి చేయడానికి అట్మాస్పియర్ వాటర్ జనరేటర్ లను వినియోగిస్తారు. తక్కువ విద్యుత్ వినియోగంతో వి ఎక్కువ నీటి ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్ ను ఉసాట రూపొందించింది. ఇలాంటివి హైదరాబాదు లో మొత్తం 7 ఏడబ్ల్యుజీ లను ఏర్పాటు చేసింది. ఈ ఒక్కో ప్లాంట్ ద్వారా 24 గంటల్లో దాదాపుగా వెయ్యి లీటర్ల మంచి నీటిని ఉత్పత్తి చేస్తుంది. అంటే రోజుకు ఏడు వేల లీటర్లు తాగునీరు ఉత్పత్తి అవుతోంది.

ఈ ఏడబ్ల్యూజి ఈ ప్రక్రియలో యంత్రాలు గాలిలోని తేమ ను గ్రహిస్తాయి అలాగే గాలిలో ఉండే కాలుష్యాన్ని కూడా వడ పోస్తాయి. మొదట ఈ నీటిని తక్కువ ఉష్ణోగ్రత నిల్వ చేసి ఆ తర్వాత మరో సారీ వడపోత లో భాగంగా నీటిని ఘన పదార్థాలను వేరు చేసి శుద్ధికరిస్తారు. ఇలా ఉత్పత్తి అయ్యే నీటిని ట్యాంకుల్లో భద్రపరిచి ఉపయోగించుకోవచ్చని కేవి రావు వెల్లడించారు. అలాగే ఎడారి ప్రాంతాలు, నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లోని ప్రజలకు ఏడబ్ల్యుజి ఒక ఓయాసిస్ లాంటిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూ ఉపరితలం మీద 70 % నీళ్లు ఉన్నప్పటికీ వారిలో జీరో 0.4% మాత్రమే తాగడానికి పనికొస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.