జగన్ నిర్ణయంతో సచివాలయాల్లో షాక్…?

రాష్ట్రంలో పాలనను సులభతరం చేసేందుకు, నిత్యం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేందుకు ఏపీ సీఎం జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థను పటిష్టం చేశాడు. గ్రామాల్లో వలంటీర్ల నియామకాలతోపాటు సచివాలయాల్లో అనేకంది సిబ్బందిని కూడా నియమించారు. దీంతో గ్రామాల్లో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమవుతున్నాయి. అయితే ఇపుడు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో సచివాలయ ఉద్యగుల్లో ఆవేదన, ఆక్రోశం వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగుల రేషన్ కార్డులు వెనక్కు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు పౌరసరఫరాశాఖ కమిషనర్ శశిధర్ లేకరాయడం కలకలం రేపింది. ప్రభుత్వం ఉన్న పళంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో సచివాలయ ఉద్యోగులు జీర్ణించుకోలేక పోతున్నారు.

ప్రభుత్వం నిబంధరల ప్రకారం రూ.10వేలకు మించి నెలసరి ఆదాయం ఉన్న వారు రేషన్ కార్డులు పొందేందుకు అనర్హులు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు నెలకు రూ.15వేల జీతం తీసుకుంటున్నారు. అంటే ప్రభుత్వమే 15వేల రూపాయల కంటే ఎక్కువ ఉన్న వారికి రేషన్ కార్డులు ఇస్తే ఎలా అని కొందరు ప్రభుత్వ పెద్దలు ఈ సలహా అధినేతకు ఇచ్చినట్లు తెలిసింది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బంది రేషన్ కార్డులు కోల్పోతారు. అంటే సుమారుగా 20 లక్షల మంది (ఒక్కో కుటుంబంలో నలుగురు ఉంటే..) ప్రభుత్వ పథకాలు పొందేందుకు అనర్హులవుతారన్నమాట. ఇదిలా ఉండగా ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్ మెంటల్ టెస్ట్ పెడతామని, అందులో ఉత్తీర్ణులైతేనే పదోన్నతులు వస్తాయని చెబుతున్నారు. ఇది ఉద్యోగులను కలవరపెడుతున్న మరో ఆందోళన. దీంతో సీఎం తీసుకున్న నిర్ణయంతో తమ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన సచివాలయ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.