సరి కొత్త లుక్ లో రాజశేఖర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

హీరో రాజశేఖర్ అంటే టక్కున రోస్ రోస్ రోజా పువ్వా పాట గుర్తొస్తుంది. ఆయన హావబావాలను, ముక కవలికలను ఇమిటేట్ చేస్తూ చాలా సినిమాల్లో జోకులు పేలాయి. అందుకే ఆయన అంత ఫేమస్ అయ్యారని కూడా చెప్పొచ్చు. తాజాగా హీరో రాజశేఖర్ ఆయన సతీమణి జీవితలు ఇద్దరూ కలిసి ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకు హాజరయ్యారు. ఈమధ్య కాలంలో గరుడ వేగ సినిమా తీసి హీరో రాజశేఖర్ హిట్టు కొట్టారు. ఆ తర్వాత ఏ సినిమా కూడా విజయం సాధించలేదు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజశేఖర్ మాటల యుద్ధం జరిగాక ఆయన కెమెరా ముందు కనిపించలేదు. రాజశేఖరే కాదు ఆయన భార్య జీవిత కూడా ఎక్కువగా వార్తల్లో నిలవలేదు. ఆ మధ్య కొన్ని రోజులు రాజశేఖర్ కు కరోనా సోకి ఆ తర్వాత కోలుకున్నారు. ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా వేడుకలో పాల్గొని ఈ దంపతులు అందరి ముందుకు వచ్చారు. శుక్రవారం ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో రాజశేఖర్ స్పెషల్ లుక్ లో కనిపించారు. తెల్లటి గడ్డంతో రాజశేఖర్ సరికొత్త లుక్ తో కనిపించడం పలువురిని అట్రాక్ట్ చేసింది.

Share post:

Latest