రాబోయే కాలానికి కాబోయే స్టార్ హీరోయిన్ ..?

శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి సినిమాను ఈ మధ్యకాలంలో తన కొడుకు అదే టైటిల్ తో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అదే పెళ్లి సందD . ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్న ఈ ముద్దుగుమ్మ శ్రీ లీలా. ఈమె కన్నడ అమ్మాయి. ఇక మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వస్తోన్న హీరోయిన్ అంటే కచ్చితంగా ఓ రేంజ్ లో ఉండే అమ్మాయి అనే చెప్పవచ్చు. అంతే కాదు ఆమె దశ కూడా తిరిగి పోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అంతేకాకుండా సినిమా రిలీజ్ కాకనే ఈ ముద్దుగుమ్మకు ఎన్నో ఆఫర్స్ వస్తున్నాయట. ఈమెకి టాలీవుడ్లో మంచి డిమాండ్ వస్తుంది. చిన్న చిన్న సినిమాలతో పాటు పెద్ద ఫిల్మ్ మేకర్ కూడా ఈమెను సంప్రదించే పనిలో ఉన్నారట.అయితే ఈమె కొత్త సినిమాలు ఏవి ఎంచుకోవటం లేదట. కానీ ఈమె సినిమాలు తీయడానికి మొదలుపెడితే వరుసగా సినిమా చాన్సులు క్యూలో వస్తాయి. ఈమె తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా మంచిగా కొత్త ఆఫర్లు వస్తున్నాయి. అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఈ అమ్మడు పెళ్లి సందడి సాంగ్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మాస్ ఆడియన్స్ ను మాత్రమే కాకుండా క్లాస్ ఆడియన్స్ ను కూడా ఇలా అన్ని వర్గాల వారిని మెప్పించేలా నటించబోతోంది. ఈ బుజ్జులు ఈ సినిమాలో అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.

ఈ కన్నడ హీరోయిన్ ల గురించి చెప్పనవసరమే లేదు.అబ్బాయిల గుండెల్ని కొల్లగొట్టిన మన నటి రష్మిక కూడా కన్నడ అమ్మాయి. రష్మిక తర్వాత శ్రీ లీలా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడం ఖాయం. ఆమె వీడియోలను , ఫోటోలను ఫాలో అవుతున్న వారు అంటున్నారు. ఇక సినిమా ఎంపిక చేసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే ఈమె ఒక లెవెల్ లో కెరీర్ ను ముందుకు తీసుకు పోవచ్చు. ఈ నమ్మకాన్ని వీడియో వర్గాలవారు వ్యక్తం చేస్తున్నారు. శ్రీ లీలా గొప్ప పొజిషన్ కు వస్తుందో ..? లేదో ..?కొద్ది రోజులు వెయిట్ చేద్దాం.