ఎయిర్ పోర్ట్‌లో పూరీ, ఛార్మీ.. ఫోటోస్ వైరల్..!

అందం అభినయంతో వెండితెరపై ఒక మెరుపు మెరిసిన అందాల తార ఛార్మీ ఇప్పుడు నటనకు స్వస్తి చెప్పి సినిమా నిర్మాణ రంగంలో అడుగు పెట్టారు. ప్రస్తుతంపూరీ క‌నెక్ట్స్ నిర్మాణ సంస్థలో భాగస్వామిగా ఉన్న ఆమె ఇప్పుడు లైగ‌ర్ అనే సినిమాని కరణ్ జోహార్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లైగ‌ర్ సినిమా ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కలిసి ఎయిర్ పోర్ట్‌లో దర్శనమిచ్చారు. మూవీ షూటింగ్ నిమిత్తం వీరిద్దరూ కలిసి ముంబయికి వెళ్తున్నారని తెలుస్తోంది. కాగా, విమానాశ్రయంలో కలసి కనిపించిన వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న లైగర్ సినిమాలో బాక్సర్గా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. అతని సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్నారు. ఈ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రంలోని ప్రీ క్లైమాక్స్ లో మైక్ టైసన్ కనిపిస్తారని సినీ వర్గాల భోగట్టా.

Share post:

Popular