పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తానంటున్న శ్రీ రెడ్డి..?

ఎప్పుడు వివాదాలకు దారి తీస్తూ తన పేరును ఎక్కువగా పాపులర్ చేసుకుంటూ ఉంటుంది నటి శ్రీరెడ్డి. ఇక ఈమె స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పై కూడా ఎన్నోసార్లు కామెంట్లు చేసింది. ఇక అంతే కాకుండా టాలీవుడ్ లో ఉండే హీరోయిన్ ల పై కూడా ఎన్నో కామెంట్లను చేస్తూ ఉంటుంది.కత్తి మహేష్ కూడా తనకి మంచి స్నేహితుడు అని చెప్పుకొచ్చింది ఆమె.

కానీ కత్తి మహేష్ చనిపోవడం తనకు చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది. ఇక అంతే కాకుండా ఆయన మరణించడం పై చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. సినిమాల విషయానికొస్తే పవన్ స్థానం ఎప్పుడూ నెంబర్ వన్ లోనే ఉంటుంది. నేను ఎవరినైనా వ్యతిరేకిస్తున్నానంటె వ్యక్తులను వ్యతిరేకిస్తున్నట్లు కాదని, వారి విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు అని వెల్లడించింది.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడానికి నేను రెడీ అని చెప్పుకొచ్చింది. కేవలం పవన్ కళ్యాణ్ విధానాలు తనకు నచ్చవు.కానీ ఆయనతో నటించడానికి నాకు ఇష్టం ఉన్నట్లు కామెంట్ తెలిపింది. దీంతో పవన్ కళ్యాణ్ నాకు అవకాశం ఇస్తాడేమో చూడాలి.కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల వైపు అసలు సుటు కాడని తెలిపింది.

రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఎదగాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా సీఎం జగన్ స్థాయిని తలదన్నేలా ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఈమె చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుత ఇమే చెన్నై లో ఉన్నది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిప్రాయాన్ని తెలియజేసింది శ్రీరెడ్డి.